Sandeep Kishan: నా కెరీర్ ఒక యూనిక్ కేస్ స్టడీ 1 y ago
హీరో సందీప్ కిషన్ తన 15 ఏళ్ల సినీ కెరీర్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. "నా కెరీర్ ఒక యూనిక్ కేస్ స్టడీ" అని చెప్పారు. ఆయన టాప్ డైరెక్టర్లు లేదా బ్లాక్‌బస్టర్ ట్రెండ్ అనుసరించకపోయినా, అనేక విషయాలు నేర్చుకున్నానని పేర్కొన్నారు. తన కెరీర్ లో అనేక మార్పులు వచ్చాయనీ, కానీ ఎవరిని సహాయం అడగలేదని చెప్పారు. అనిల్ రావిపూడి తనకు గౌరవం ఇస్తున్నారని, అందుకే ఆయనతో మళ్లీ పని చేస్తున్నానని తెలిపారు. తన సినిమా ప్రమోషన్ల కోసం ఎవరిని సంప్రదించలేదని.. తొలిసారిగా చిరంజీవి గారి దగ్గరికి, ప్రభాస్ అన్న దగ్గరికి వెళ్లానని పేర్కొన్నారు.